ఖమ్మం: ఖమ్మం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ వో సీతారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిప్యూటీ డీఎంహెచ్ వో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విసన్న పేటలో కీర్తన జనరల్ హాస్పిటల్ పేరుతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని కొన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారు.
ALSO READ :- ఉద్యోగాలు ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శన
అయితే హాస్పిటల్ కు వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధితులు హాస్పిటల్ ను ముట్టడించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో విసన్నపేటలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో సత్తుపల్లి డివిజన్ లోని మహిళ ఉద్యోగులపై కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలు ఉన్నప్పటికీ సీతారంపై ఫిర్యాదు చేయ్యాటానికి ఎవరూ సాహసం చేయలేదు.